కాబోయే భార్యకు అవకాశాలు లేకపోవడంతో.. డైరెక్టర్‌ను అడిగి మరీ ఆ మూవీలో ఛాన్స్ ఇప్పించిన మెగా ప్రిన్స్

by Anjali |   ( Updated:2023-09-14 13:19:22.0  )
కాబోయే భార్యకు అవకాశాలు లేకపోవడంతో.. డైరెక్టర్‌ను అడిగి మరీ ఆ మూవీలో ఛాన్స్ ఇప్పించిన మెగా ప్రిన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఐదేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నా.. ఎంగేజ్‌మెంట్ వరకు గుట్టుచప్పుడు లేకుండా వీరి బంధాన్ని మెయిటైన్ చేశారు. ఇక త్వరలోనే వీరిద్దరు వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో వరుణ్ గురించి నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. అప్పట్లో లావణ్యకు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో వరుణ్ ఓ సినిమాలో అడిగి మరీ ఛాన్స్ ఇప్పించాడట. వరుణ్ తేజ్ హీరోగా.. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంతరిక్షం 9000 KMPH’ చిత్రంలో ఫస్ట్ హీరోయిన్‌గా అదితీ రావు హైదరీని ఎంపిక చేశారట. తర్వాత రెండో హీరోయిన్‌గా వేరే కథానాయికను తీసుకుందామని చిత్ర యూనిట్ ఆలోచనలో ఉందట. కానీ వరుణ్ తన కాబోయే భార్యపై ప్రేమతో ఈ మూవీలో లావణ్యనే నటిస్తుందని దర్శకుడిని అడిగి మరీ ఆమెను సినిమాలో నటించేటట్లు చేశాడట.

Advertisement

Next Story