మహేష్‌ బాబు యాడ్స్‌, చిత్రాలకు డబ్బింగ్‌ చెప్పిన బజర్దస్త్ కమెడియన్ ఇతడే?

by Anjali |   ( Updated:2024-02-28 15:18:17.0  )
మహేష్‌ బాబు యాడ్స్‌, చిత్రాలకు డబ్బింగ్‌ చెప్పిన బజర్దస్త్ కమెడియన్ ఇతడే?
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గుంటూరు కారం’ ఇటీవల విడుదలై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటివరకు డీసెంట్‌గా కనిపించే ప్రిన్స్ ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరోయిన్‌తో ఊర మాస్ స్టెప్పులేసి ప్రేక్షకులను అలరించాడు.

ప్రస్తుతం స్టార్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ మూవీలో నటిస్తున్నాడు. జక్కన్న-సూపర్‌స్టార్ కలయికలో వస్తున్న ఈ చిత్రం కోసం మహేష్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే ప్రిన్స్ అటు సినిమాలతో పాటు యాడ్స్‌లో నటిస్తోన్న విషయం తెలిసిందే. సంతూర్‌, బైజూస్‌, థమ్స్ అప్‌, డ్యూక్‌, మసాలా, రియల్‌ ఎస్టేట్‌, నగలు, పర్‌ఫ్యూమ్‌, ఇలా చాలా యాడ్స్ చేశారు.

అయితే ఇందులో కొన్ని యాడ్స్‌కు జబర్దస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్ డబ్బింగ్ చెప్పారట. ఈ విషయాన్ని స్వయంగా బుల్లెట్ భాస్కరే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ‘వన్, నేనొక్కడినే’ సినిమాలో ఓ ట్రాక్‌కు భాస్కర్ డబ్బింగ్‌ చెప్పడంతో అచ్చం తనలాగే వాయిస్ వస్తుందని మహేష్ షాక్ అయ్యారట. ఇంటర్వ్యూలో భాస్కర్.. సూపర్‌స్టార్‌లా మాట్లాడి వినిపించడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు.

Read More..

‘పుష్ప-2’లో ఆ ఒక్క సీన్ కోసం ఏకంగా రూ. 50 కోట్లు ఖర్చు చేశారా?

Advertisement

Next Story