ఇలాంటి బట్టలు వేసుకుని భారతదేశం పరువు తీయకు.. ఉర్ఫీపై అంకుల్ ఫైర్

by sudharani |   ( Updated:2023-07-24 15:48:34.0  )
ఇలాంటి బట్టలు వేసుకుని భారతదేశం పరువు తీయకు.. ఉర్ఫీపై అంకుల్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉర్ఫీ జావెద్ గురించి అందరికి తెలిసిందే. నిత్యం సోషల్ మీడియాలో బిజీగా ఉండే ఈ బ్యూటీ.. వింత వింత డ్రెస్సులతో దర్శనమిచ్చి ట్రోల్స్‌కు గురవుతుంది. అంతే కాకుండా.. తనను ఎవరైనా విమర్శించిన కూడా నెట్టింట గట్టిగా కౌంటర్ ఇస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల అమ్మడుకి ఓ చేదు అనుభవం ఎదురైంది. గోవా నుంచి ముంబైకి తిరిగి వచ్చిన క్రమంలో ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తున్న ఉర్ఫీని చూసిన ఓ వ్యక్తి తనను విమర్శించాడు.

ఇలాంటి దుస్తులు ధరించి తిరుగుతున్నావు. ఇక్కడ ఇలాంటి బట్టలు వేసుకోకూడదు. అసలు ఈ బట్టలు ధరించి ఇండియా పరువు తీయోద్దంటూ వ్యాఖ్యానించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఉర్ఫీ.. ‘‘ఇదేమైనా నీ బాబుదా.. మీ బాబు వల్ల ఏమైనా జరిగిందా.. నువ్వు వెళ్లి నీ పని చూసుకో’’ అంటూ అతడిపై ఆగ్రహించింది. అయినప్పటికీ ఆ వ్యక్తి ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తుంటే.. మరింత కోపంతో ఆయన మీదకు వెళ్లిన ఉర్ఫీ.. ‘‘అంకుల్ నీ పని చూసుకో.. బేవకూఫ్’’ అంటూ తిట్టింది. అయితే దీనికి సంబంధించిన వీడియో అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్‌లో రికార్డు కావడంతో.. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement

Next Story