ఒకే ఏడాదిలో తల్లిదండ్రులను కోల్పోయిన Mahesh babu .. జుట్టు ఎందుకు తీయలేదంటే?

by Hamsa |   ( Updated:2022-11-26 08:52:59.0  )
ఒకే ఏడాదిలో తల్లిదండ్రులను కోల్పోయిన Mahesh babu .. జుట్టు ఎందుకు తీయలేదంటే?
X

దిశ, సినిమా : ప్రిన్స్ మహేశ్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే. ఇక తండ్రి మరణానికి కొన్ని రోజుల ముందే తల్లి ఇందిరా దేవి కూడా చనిపోయారు. ఇలా ఒకే ఏడాదిలో మహేశ్ ఇంట వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. అయితే, తల్లిదండ్రులిద్దరికీ మహేశ్ బాబు తలకొరివి పెట్టినప్పటికీ.. తలనీలాలు ఇవ్వకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులు మరణిస్తే.. కొడుకులు తలనీలాలు సమర్పించిన తర్వతే కర్మకాండలన్నీ పూర్తి చేస్తారు. కానీ ఇక్కడ మహేశ్ నటిస్తున్న అప్‌కమింగ్ చిత్రాల వల్లే అలా చేయలేదని తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్‌తో మహేశ్ చేస్తున్న మూవీ ఆల్రెడీ సెట్స్‌పై ఉందని తెలిసిందే. అలాగే మహేశ్ జుట్టు పూర్తి స్థాయిలో ఒరిజినల్ కాదు. చాలా సహజంగా కనిపించే 'క్యూ6 హెయిర్ ప్యాచ్' టెక్నాలజీతో జుట్టును ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నారు. అందుకే కష్టంగా అనిపించినప్పటికీ ఈ కారణాలతో మహేశ్ తనకు ఇష్టంలేకున్నా జుట్టు తీయలేకపోయారు.

Read more:

1.సెన్సార్ బోర్డు సభ్యులకు షాక్ ఇచ్చిన 'హిట్

ఆన్ లైన్ ప్రియుడి కోసం 5000 కి మీ ప్రయాణం.. చివరకు ఆమెను ముక్కలు చేసి అవయవాలు అమ్ముకున్న వ్యక్తి

Advertisement

Next Story