Sobhita: నాగ చైతన్య కంటే ముందు శోభితా ప్రాణంగా ప్రేమించిన అబ్బాయెవరో తెలిస్తే షాక్..

by Anjali |
Sobhita: నాగ చైతన్య కంటే ముందు శోభితా ప్రాణంగా ప్రేమించిన అబ్బాయెవరో తెలిస్తే షాక్..
X

దిశ, సినిమా: ఇండస్ట్రీలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఊహించరి రేంజ్‌లో నెటిజన్లకు షాక్ ఇచ్చారు హీరో నాగచైతన్య-శోభితా ధూళిపాళ్ల. నిన్న (ఆగస్టు 8) ఇరుకుంటుంబీకుల సమక్షంలో చై-శోభితా సింపుల్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. లైట్ పింక్ కలర్ శారీ కట్టుకుని, తలలో ఆరెంజ్ రంగు పువ్వులు పెట్టుకుని చాలా సింపిల్ లుక్ శోభితా.. వైట్ పంచా ధరించి నాగచైతన్య అక్కినేని ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. వీరి ఫొటోలను ముందుగా నాగార్జున నెట్టింట పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ షాక్ తిన్నారు. శోభితా.. చైతూ చేయి పట్టుకుని భుజం మీద తల వాల్చి ఉన్న ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే శోభితా అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడకముందు వేరే వ్యక్తిని ప్రాణంగా లవ్ చేసిందట. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అయిన ప్రణవ్ మిశ్రాతో కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉందట. 2019 లో మొదలైన వీరి లవ్ ఎంతో అన్యోన్యంగా సాగిపోతుండగా.. కారణమేంటో తెలియదు కానీ మనస్పర్థలు వచ్చి విడిపోయారట. ఇక తర్వాత శోభితా మన టాలీవుడ్ హీరో నాగ చైతన్యతో ప్రేమలో పడింది. అప్పటికే చైతూకు కూడా సమంతతో విడాకులు అయ్యాయి. దీంతో వీరిద్దరు ఒక్కటయ్యారు. మరొకొన్ని డేస్‌లో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.

Advertisement

Next Story