Remuneration :టాలీవుడ్‌లో కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

by Jakkula Samataha |
Remuneration :టాలీవుడ్‌లో కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
X

దిశ, సినిమా : చిత్ర పరిశ్రమలో నటీనటుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొందరు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది రోజుల్లోనే, స్టార్‌గా మారి కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఒక్కో హీరోయిన్ హీరోలకు ధీటుగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. రూ.100 కోట్లు కూడా కొందరు హీరోయిన్స్ ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం కొత్తగా వచ్చిన హీరోయిన్స్ ఒక్క సినిమా హిట్ కాగానే, కోట్లలో రెమ్యూనరేషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.

అయితే ఇప్పటితో పోలిస్తే గంతలో నటీనటుల రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉండేది. కోటి రూపాయల కంటే తక్కువే, కాగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? టాలీవుడ్ ‌లో మొట్ట మొదటిసారిగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ ఎవరు అంటూ ఓ వార్త వైరల్‌గా మారింది. కాగా,ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మొదటిసారి కోటి రూపాయలు తీసుకున్న హీరోయిన్ శ్రీదేవి కాగా, టాలీవుడ్‌లో మాత్రం మొదటగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న బ్యూటీ ఇలియానా. ఈ నటి తన మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక పోకిరి సినిమాతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. దీంతో ఈ బ్యూటీ తర్వాత చిత్రం ఖతార్నాక్‌కు కోటిరూపాయలు తీసుకుందంట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story