మెగాస్టార్ తండ్రిగా నటించిన ఆ సీనియర్ హీరో ఎవరో గుర్తుపట్టారా?

by sudharani |   ( Updated:2022-10-10 12:23:16.0  )
మెగాస్టార్ తండ్రిగా నటించిన ఆ సీనియర్ హీరో ఎవరో గుర్తుపట్టారా?
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా తాజాగా తెరకెక్కిన సినిమా 'గాడ్ ఫాదర్'.(Godfather మూవీ) మలయాళ సూపర్ హిట్ సినిమా 'లూసీఫర్' కు రీమేక్‌గా వచ్చిన ఈ మూవీకి మోహన్ రాజా డైరెక్షన్‌ వహించారు. దసరా సందర్భంగా విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో చాలా మంది సీనియర్ యాక్టర్స్ నటించిన విషయం తెలిసిందే. అందులో ఒకరు సర్వదామన్.

చిరంజీవి, నయనతారకు తండ్రిగా నటించి మెప్పించిన ఈ నటుడు మరెవరో కాదు.. కళాతపస్వి కె. విశ్వనాథ్ తెరకెక్కించిన 'సిరివెన్నెల' సినిమాలో హీరోగా నటించిన వ్యక్తే ఈ సర్వదామన్. ఆ సినిమాలో అంధుడి పాత్రలో అద్భుతంగా నటించిన ఈయన.. చాలా కాలం తర్వాత మోగాస్టార్‌తో జతకట్టడంతో ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే సర్వదామన్ సెకండ్ రీఎంట్రీ ఇలాగే కొనసాగుతుందో లేదో చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి : ఫిల్మ్ డైరెక్షన్ ఈజ్ మై బిగ్గెస్ట్ డ్రీమ్: రితీష్ దేశ్‌ముఖ్

Advertisement

Next Story