వాలెంటైన్స్ డే’ రోజున రీ-రిలీజ్ కానున్న సినిమాలు ఏవో తెలుసా?

by Jakkula Samataha |
వాలెంటైన్స్ డే’ రోజున రీ-రిలీజ్ కానున్న సినిమాలు ఏవో తెలుసా?
X

దిశ, సినిమా : ప్రస్తుతం రీరిలీజ్‌ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలు రీరిలీజై సూపర్ సక్సెస్ అందుకొంటున్న విషయం తెలసిందే. ఈ క్రమంలో మరో నాలుగు సినిమాలు మరోసారి విడుదలకు సిద్ధమయ్యాయి.యూత్‌ను ఎంతో ఆకట్టుకున్న నాలుగు సినిమాలు ఫిబ్రవరి 14న విడుదలకానున్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

తొలి ప్రేమ.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా 1998లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పటికీ ఈ మూవీ అంటే చాలా మందికి ఇష్టం. కాగా, వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీని మరోసారి రీరిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

సీతారామం.. తమ ప్రేమతో ప్రేక్షకుల మనసులు గెలుచుకొని, బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా సీతారామం. ఎమోషనల్ లవ్ స్టోరీతో ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంది.కాగా,వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ఈ మూవీ రీ-రిలీజ్ కానుంది. హైదరాబాద్‍లోని కొన్ని థియేటర్లలో ఈ చిత్రం రీ-రిలీజ్ అవుతుందని తెలుస్తోంది.

ఓయ్.. ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే.అనుకోలేదు ఏనాడు ఈలోకం నాకోసం అనే పాట ఇప్పటికీ ప్రతీ ఒక్కరి మదిలోనిలిచిపోయింది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. కాగా ఈమూవీ వాలెంటైన్స్ డే సందర్భంగా కొన్ని థియేటర్స్‌లో రీరిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

సూర్య సన్నాఫ్ కృష్ణన్..సూర్య సన్నాఫ్ కృష్ణన్..తమిళ స్టార్ హీరో సూర్య డ్యుయల్ రోల్ చేసిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ మూవీ కూడా వచ్చే వారం ప్రేమికుల రోజున థియేటర్లలోకి మళ్లీ రానుంది. ఈ చిత్రం రీ-రిలీజ్ అవడం ఇది రెండోసారి. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన తమిళ మూవీ వారనమ్ అరియమ్ చిత్రం తెలుగులో ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ 2008లో విడుదలైంది.

Advertisement

Next Story