Mahesh Babu: మహేష్ బాబు ఫోన్ వాల్ పేపర్ ఏం పెట్టుకున్నారో తెలుసా?భార్య పిల్లల్ది మాత్రం కాదండోయ్

by Anjali |
Mahesh Babu: మహేష్ బాబు ఫోన్ వాల్ పేపర్ ఏం పెట్టుకున్నారో తెలుసా?భార్య పిల్లల్ది మాత్రం కాదండోయ్
X

దిశ, సినిమా: ఘట్టమనేని వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అగ్ర హీరో దివంగత కృష్ణ కుమారుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. 8 చిత్రాలకు పైగా బాలనటుడిగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ‘‘అర్జున్, ఒక్కడు, టక్కరి దొంగ, మురారి, పోకిరి, అతిథి, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట, గుంటూరు కారం’’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళితో ఓ భారీ ప్రాజెక్టు‌లో నటించబోతున్నారు. ఈ చిత్రం కోసం సూపర్‌స్టార్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఇకపోతే ఇటీవలే మహేష్ బాబు తన పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రిన్స్‌కు సోషల్ మీడియా వేదికన పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లివిరిశాయి. అలాగే మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా మురారి సినిమా రీరిలీజై భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇదంతా పక్కన పెడితే సూపర్ స్టార్ ఫోన్ లో పెట్టుకున్న వాల్ పేపర్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సాధారణంగా ప్రిన్స్ తన గారాల పట్టి సితార పికో లేక కుమారుడు గౌతమ్, భార్య నమ్రత ఫొటో పెట్టుకుంటారని అందరూ భావిస్తారు. కానీ ప్రిన్స్ ఎవరూ ఊహించని విధంగా విభిన్నమైన వాల్ పేపర్ పెట్టుకుని నెటిజన్లకు ఆశ్చర్యపరుస్తున్నారు. మరీ సూపర్ స్టార్ వాల్ పేపర్‌గా పెట్టుకున్న పిక్ ఏంటంటే..? ఎర్త్ (గ్లోబ్)పిక్ పెట్టుకున్నారు. ప్రిన్స్ ఫొన్‌‌లో ఇండియా మ్యాప్ కూడా కనిపించడం విశేషం. ఇది వీక్షించిన అభిమానులు మహేష్ బాబుపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Read More..

Mahesh Babu: సినిమాల్లోకి మహేశ్ బాబు కొడుకు ఎంట్రీ.. ఆ మూవీ సీక్వెల్‌లో గౌతమ్‌?

Advertisement

Next Story

Most Viewed