మహేష్ బాబు మొబైల్ రింగ్ టోన్ ఏంటో తెలుసా?

by Anjali |   ( Updated:2023-08-22 06:58:18.0  )
మహేష్ బాబు మొబైల్ రింగ్ టోన్ ఏంటో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కాగా ఈ హీరో బిగ్‌సికు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. బిగ్ సి 20 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా.. వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్స్ హాజరై.. మీడియా ప్రతినిధులతో చర్చించారు. వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ.. ఎన్నో వ్యక్తిగత, వృత్తిపర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో ఓ రిపోర్టర్ మీ మొబైల్ రింగ్ టోన్ ఏంటి? అని అడగ్గా.. ‘సైలెంట్’ అని బదులిచ్చారు. నా ఫోన్ ఎప్పుడు సైలెంట్‌లో ఉంటుంది. సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంటాను కాబట్టి సైలెంట్‌లోనే ఉంచుతాను. అని సూపర్ స్టార్ వెల్లడించారు. ప్రిన్స్ సమాధానాలు ఎప్పుడూ ఊహించని విధంగా ఉంటాయంటూ.. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed