నాగార్జున సౌందర్య, రమ్యకృష్ణలతోనే ఎక్కువ సినిమాలు చేయడానికి కారణం ఏంటో తెలుసా?

by Jakkula Samataha |   ( Updated:2024-04-03 13:05:20.0  )
నాగార్జున సౌందర్య, రమ్యకృష్ణలతోనే ఎక్కువ సినిమాలు చేయడానికి కారణం ఏంటో తెలుసా?
X

దిశ, సినిమా : అక్కినేని నాగార్జున సినిమాలు అంటే యూత్‌లో మంచి క్రేజ్ ఉండేది. తన నటనతో మ్యాజిక్ చేసి అందరినీ ఇట్టే పడేసేవాడు. అక్కినేని నాగేశ్వర్ రావు నటవారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈయన చేసిన సినిమాల్లో శివ, గీతాంజలి, హలో బ్రదర్ లాంటి సినిమాలో గుర్తుకు వస్తాయి.

ఇక నాగార్జున లవ్, రొమాంటిక్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అయితే ఈయన ఎక్కువగా సౌందర్య, రమ్యకృష్ణలతో సినిమాలు తీశారు. చిత్ర పరిశ్రమలో అప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. కానీ వాళ్లందరినీ వదిలేసి నాగార్జున వీరితోనే ఎందుకు ఎక్కువ సినిమాలు తీశారో ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జునను, ఇండస్ట్రీలో రంభ, మీన, స్నేహ ఇలా ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నా, మీరు ఎక్కువగా సౌందర్య, రమ్యకృష్ణతోనే ఎందుకు చాలా సినిమాలు తీశారు అని అడగ్గా, దానికి కింగ్ నాగార్జున సమాధానం ఇస్తూ.. నాతో సినిమా చేసే దర్శకులు సౌందర్య, రమ్యకృష్ణల పేర్లను నా దగ్గర ఎక్కువగా ప్రస్తావించేవారు. మా కాంబినేషన్ బాగుంటుంది, ఈ సినిమాకు మీకు జోడిగా ఈ హీరోయిన్ అయితేనే బాగుంటుంది అని వారు చెప్పడంతో వారినే ఎక్కు రిపీట్ చేస్తూ వచ్చాను. అందువల్లే వారి నిర్ణయానికి తల వంచి నేను వారితో చాలా సినిమాల్లో నటించాను. అంతే కాకుండా మా కాంబినేషన్‌కు మంచి గుర్తింపు ఉంది. మేము కలిసి నటించిన సినిమాలు మంచి సక్సెస్ అందుకునేవి అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ ట్రెండ్ అవుతోంది.

Read More..

మెగాస్టార్ చిరంజీవి నిద్ర లేవగానే సురేఖ ముఖం కాకుండా.. ఎవరి ఫొటో చూస్తాడో తెలిస్తే షాక్?

Advertisement

Next Story