ఫ్రెండ్ పెళ్లిలో తళుక్కుమన్న అలియా భట్.. ఆమె కట్టుకున్న ఎల్లో చీర ఖరీదెంతో తెలుసా !

by Prasanna |   ( Updated:2023-12-18 07:25:10.0  )
ఫ్రెండ్ పెళ్లిలో తళుక్కుమన్న అలియా భట్.. ఆమె కట్టుకున్న ఎల్లో చీర ఖరీదెంతో తెలుసా !
X

దిశ, సినిమా: సెలబ్రెటీల లగ్జరీ లైఫ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వారు తమకు సంబంధించిన ప్రతి ఒక్కటీ చాలా ఖరీదైనవి మెయింటైన్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వేసుకునే బట్టల ఖరీదు లక్షల్లో, కోట్లలో ఉంటుంది. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తన ఫ్రెండ్ దిశా పెళ్లిలో తళుక్కుమంది. ఇక అక్కడికి వచ్చినవారందరి చూపు అలియా కట్టుకున్న చీర మీదే పడింది. ఎందుకంటే ఆ శారీ చాలా స్పెషల్‌‌గా ఉంది. పైగా దానికి తగ్గట్టు అలియా భట్ హెయిర్ స్టైల్ కూడా ఆకట్టుకుంది. అలా ఎల్లో కలర్ ఆర్గాంజా శారీలో దేవ కన్యలా మెరిసిపోతున్న అలియాను చూసిన వారంతా కళ్లు పక్కకు తిప్పుకోలేకపోయారు. ఇదిలా ఉండగా ఆమె కట్టుకున్న చీర ధర‌పై కూడా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. దాని ఖరీదు అక్షరాలా రెండున్నర లక్షలు అని విన్న నెటిజన్లు వామ్మో అంటూ నోరెళ్లబెడుతున్నారు.

Advertisement

Next Story