- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామ మందిర ప్రారంభోత్సవంలో ఆలియా కట్టుకున్న చీర ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, రణబీర్ కపూర్ ప్రేమించుకున్నారు. వీరిద్దరు పెద్దలను ఒప్పించి 2022 ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఓ పాప కూడా ఉంది. ఆమెకు రహా అనే పేరు పెట్టారు. కానీ ఆ పాప పుట్టినప్పటినుంచి ఫేస్ రివీల్ చేయలేదు. ఇటీవల తన కూతురిని మీడియా ముందుకు తీసుకొచ్చారు. దీంతో అందరూ తన తాత పోలికలు వచ్చాయని కామెంట్లు చేశారు. ఇక ఆలియా, రణబీర్ సినీ కెరీర్ విషయానికొస్తే.. ఇద్దరూ వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
ఈ వేడుకకు ఆలియా భట్ ఒక అద్భుతమైన చీరను కట్టుకొని వెళ్లి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. దీంతో వాటిని చూసిన వారంతా ఆ చీర ఖరీదు ఎంతని తెగ వెతికేస్తున్నారు. తాజాగా, ఆలియా భట్ చీరకున్న ప్రత్యేకత దాని రేటు గురించి పలు విషయాలు బయటపడ్డాయి. ఆలియా భట్ కట్టకున్న ఈ అందమైన సిల్క్ చీరను మాధుర్య క్రియేషన్స్ వారు డిజైన్ చేశారని తెలుస్తోంది. ఈ చీరను ఆమె కోరిక మేరకు 10 రోజుల్లో తయారు చేసి ఇచ్చారట.
ఆ చీరపై ఎంతో అందంగా.. రామాయణంలోని ముఖ్యమైన ఘట్టాలను డిజైన్ చేశారు. రాముడు శివ ధనుస్సును విరవడం, రాముడిని అడవికి వెళ్లమని అడగడం, గంగా నదిపై వంతెన, బంగారు జింక, సీతాపహరణ వంటి రామాయణ ఘట్టాల చిత్రాలు ఈ చీరపై డిజైన్ చేశారు. అయితే దీని రేటు రూ. 50,000 ఉంటుందట సమాచారం. దీంతో ఈ విషయం తెలిసిన వారు షాక్ అవుతున్నారు. ఒక్క చీరకే అంత డబ్బు పెడితే సంవత్సరం మొత్తం ఉపయోగించే దుస్తులు ఎంత ఖర్చు అవుతాయోనని అంటున్నారు.