రిసెప్షన్‌లో లావణ్య ధరించిన చీర ధర ఎంతో తెలుసా?

by Hamsa |   ( Updated:2023-11-06 10:48:17.0  )
రిసెప్షన్‌లో లావణ్య ధరించిన చీర ధర ఎంతో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వరుణ్-లావణ్య వార్తలే ట్రెండిగ్‌లో ఉన్నాయి. వీరిద్దరి పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నవంబర్ 1న వీరి పెళ్లి ఇటలీలో ఘనంగా జరిగింది. ఇక వీరి రిసెప్షన్ నవంబర్ 5న హైదరాబాద్ ఎన్ కన్వెషన్ హాట్‌లో టాలీవుడ్ సినీ ప్రముఖుల మధ్య జరిగింది. దీనికి పలువురు హాజరై సందడి చేశారు. ఇక ఇందులో మెగా కోడలు లావణ్య మెటాలిక్ చీర ధరించి సంప్రదాయంగా కనిపించింది. అయితే దీనిని ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా చాలా ప్రత్యేకంగా రెడీ చేశారట.

దీని ధర దాదాపు రూ. 2.75 లక్షలు ఉంటుందని సమాచారం. అయితే మరీ ముఖ్యంగా ఇదే మోడల్ చీరలో బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కట్టుకుందట. ఓ ప్రముఖ ఈవెంట్‌లో ఆ చీరలో సుహాన కనిపించి అదరహో అనిపించింది. దీంతో లావణ్య కూడా అలాంటి చీరనే సెటక్ట్ చేసుకుని రిసెప్షన్‌లో మరింత అందంగా కనిపించింది. అయితే మెగా కోడలు ఈ వేడుకలో మోడ్రన్ డ్రెస్ ధరిస్తుందని అందరూ భావించారు. కానీ ఈ అమ్మడు మాత్రం తెలుగింటి అమ్మాయిలా కనిపించి ప్రశంసలు అందుకుంటుంది.




Advertisement

Next Story

Most Viewed