ఊ అంటావా.. కంటే ముందే సమంత చేయాల్సిన ఐటమ్ సాంగ్ ఏదో తెలుసా?

by Jakkula Samataha |   ( Updated:2024-01-28 04:14:07.0  )
ఊ అంటావా.. కంటే ముందే సమంత చేయాల్సిన ఐటమ్ సాంగ్ ఏదో తెలుసా?
X

దిశ, సినిమా : ఎన్ని ఐటమ్స్ సాంగ్స్ వచ్చినా, పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ క్రేజీనే వేరుంటుంది. ఊ అంటవా మావా.. ఊ ఊ అంటవా అంటూ సమత హాట్ హాట్ లుక్స్‌తో చేసిన ఈ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే సామ్ ఐటమ్ సాంగ్ చేసింది. ఓ స్టార్ హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేస్తుందని తెలియడంతో అందరి కళ్లు ఆ మూవీపైనే పడ్డాయి.ఎప్పుడెప్పుడు సామ్ ఐటమ్ సాంగ్ చూద్దామా అని ఆశగా ఎందురు చూశారు. ఇక మూవీ రిలీజైన తర్వాత సమంత స్టెప్స్‌కు అందరూ ఫిదా అయిపోయారు. నిమిషాల్లోనే వ్యూవ్స్ మిలియన్స్ దాటిపోయాయి. ఎక్కడ చూసినా ఊ అంటావా అనే సాంగే వినిపించింది.

అయితే సమంత పుష్ప సినిమా కంటే ముందు ఓ ఐటమ్ సాంగ్‌లో చేయాల్సి ఉండేదంట. కానీ ఆ ఆఫర్ సామ్ రిజక్ట్ చేయడంతో, ఆ సాంగ్‌లో తమన్నా చేసిందంట. ఇంతకు ఏ మూవీ అనుకుంటున్నారా? మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ అనే సినిమా.

Advertisement

Next Story