SOBHITA DHULIPALA: శోభితా ధూళిపాళ్ల -నాగ చైతన్య క్యాస్ట్ ఏంటో తెలుసా..!

by Anjali |
SOBHITA DHULIPALA: శోభితా ధూళిపాళ్ల -నాగ చైతన్య క్యాస్ట్ ఏంటో తెలుసా..!
X

దిశ, సినిమా: అక్కినేని హీరో నాగచైతన్య-శోభితా ధూళిపాళ్ల త్వరలో ఒక్కటి కాబోతున్నారు. గురువారం ఇరుకుటుంబీకుల సమక్షంలో చైతూ-శోభితా నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను నాగార్జున సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం వీరి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన శోభితా ధూళిపాళ్ల భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఈ భామ నాగచైతన్యతో ప్రేమలో పడి.. త్వరలో అక్కినేని ఇంటి కోడలు కాబోతుంది. ఈ నేపథ్యంలో శోభితకు సంబంధించిన పలు విషయాలను నెటిజన్లు సెర్చ్ చేయడం ప్రారంభించారు.

శోభితా మే 31న గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించింది. తల్లి పేరు శాంతా కామాక్షి, తండ్రి పేరు వేణు గోపాల్ రావు. తండ్రి ఇంజనీరింగ్ కాగా.. తల్లి ఉపాధ్యాయురాలు. శోభితా చిన్నతనంలోనే వీరు వైజాగ్‌కు షిఫ్ట్ అయ్యారు. ఈమె విశాఖపట్నంలోని లిటిల్ ఏంజెల్స్ పాఠశాలలో చదివింది. ఈ బ్యూటీ చిన్నప్పటి నుంచే చదువులో అందరికంటే ముందుండేదట. డాక్టర్ అవ్వాలనే కోరిక ఉండేదట. ఇకపోతే ప్రస్తుతం అక్కినేని ఇంటి కోడలి కాబోతున్నందున మరీ శోభితా ఏ క్యాస్ట్ అంటూ నెటిజన్లలో సందేహాలు తలెత్తుతున్నాయి. ఇంట్లో సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యతనిచ్చే శోభితా ధూళిపాళ్లది అచ్చమైన బ్రహ్మణ కులం కావడం విశేషం. కాగా నాగచైతన్య-శోభితాది ఇంటర్‌క్యాస్ట్ మ్యారేజ్. ఇక నాగచైతన్య క్యాస్ట్ కమ్మ అని తెలిసిన విషయమే.

More News: నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ ప్రశ్న.. అక్కినేని వారి ఇంటి కోడలు అయ్యేంత రేంజ్ ఆమెకు ఉందా?

Advertisement

Next Story

Most Viewed