అదితి కంటే సిద్ధార్థ్ అన్ని సంవత్సరాలు పెద్ద వాడా.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?

by Disha Web Desk 6 |
అదితి కంటే సిద్ధార్థ్ అన్ని సంవత్సరాలు పెద్ద వాడా.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
X

దిశ, సినిమా: హీరో సిద్ధార్థ్-అదితి రావు హైదరి 2021లో ‘మహాసముద్రం’ సినిమాలో జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరిద్దరి ప్రేమలో పడ్డారు. ఇక అప్పటి నుంచి ఒకే ఇంట్లో ఉంటూ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసి మిలియన్ల కొద్ది ఫాలోవర్స్‌ను పెంచుకున్నారు. అంతేకాకుండా వీరిద్దరు కలిసి పలు ఈవెంట్స్, రెస్టారెంట్స్‌కు వెళ్తూ మీడియా కంట పడటంతో వీరి ప్రేమ విషయం బయటకు వచ్చింది.

అదితి- సిద్దు 2021 నుంచి డేటింగ్‌లో ఉన్నట్లు ఇప్పటికే వార్తలు నెట్టింట మార్మోగిపోయాయి. ఈ క్రమంలో వీరిద్దరిని పెళ్లి గురించి అడగ్గా.. డేటింగ్‌లో నిజం లేదన్నట్టుగా వ్యవహరించారు. అయితే ఈ జంట సీక్రెట్‌గా మార్చి 27న తెలంగాణలోని వనపర్తిలోని రంగనాయక స్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ అధికారికంగా మాత్రం వీరిద్దరు తమ పెళ్లి గురించి ప్రకటించలేదు. అలాగే వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు కూడా బయటకు రాలేదు. ఈ క్రమంలో అదితి హిరా మండి ప్రమోషన్స్‌కు రాకపోవడంతో వీరి పెళ్లి నిజమే అని కన్ఫార్మ్ అయిపోయింది.

ఇదిలా ఉంటే.. తాజాగా, సిద్ధార్థ్- అతిథి మధ్య ఏకంగా 7 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే అదితి 1986 అక్టోబర్ 28న హైదరాబాద్‌లో జన్మించింది. అయితే ప్రస్తుతం ఆమె వయస్సు 37 సంవత్సరాలు. ఇక సిద్ధార్థ్ విషయానికి వస్తే.. 1979 ఏప్రిల్ 17న పుట్టాడు. దీంతో పోల్చుకుంటే వీరిద్దరి మధ్య ఏకంగా 7 సంవత్సరాల ఉందన్న మాట. ఇక ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అంతేకాకుండా పాపం అదితి పోయి పోయి 7 సంవత్సరాలు పెద్ద వాడిని చేసుకుందా? అని అంటున్నారు. కాగా వీరిద్దరికి ఇది రెండో పెళ్లి అని తెలుస్తోంది.


Next Story

Most Viewed