కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. పదవీ కాలం పొడిగింపు..

by Indraja |   ( Updated:2024-04-27 06:27:11.0  )
కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. పదవీ కాలం పొడిగింపు..
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ బేస్‌పైన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. కాంట్రాక్టు ఉద్యోగుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ బేస్‌పైన విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉద్యోగుల పదవీకాలం ఈ ఏడాది మార్చితో ముగిసింది.

అయితే ఆయా విభాగాధిపతులు అభ్యర్థన మేరకు ఉద్యోగుల పదవీ కాలాన్ని వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో కాంట్రాక్ట్ బేస్‌పైన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు మరో సంవత్సరం పాటు యధావిధిగా విధులు నిర్వహించి జీతం తీసుకునే వెసులుబాటను ప్రభుత్వం కల్పించింది.

Advertisement

Next Story