Virupaksha : సినిమాలో హీరోయిన్ తల్లిగా నటించిన నటి ఎవరో తెలుసా?

by samatah |   ( Updated:2023-05-25 16:15:56.0  )
Virupaksha : సినిమాలో హీరోయిన్ తల్లిగా నటించిన నటి ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన విరూపాక్ష సినిమా ఎంత పెద్ద హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే?

విరూపాక్ష సినిమాలో హీరోయిన్ తల్లిగా నటించిన నటి ఎవరు అని పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు నెటిజన్స్. అయితే హీరోయిన్ తల్లి పాత్రలో నటించిన నటి పేరు సాయి కామాక్షి భాస్కర్ల. ‘ప్రియురాలు’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు విరూపాక్ష మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ నటి వృత్తిరీత్యా డాక్టర్. కానీ సినీరంగంపై మక్కువతో మోడల్ గా చేస్తూనే పలు సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంది. ప్రియురాలు సినిమాలో హీరోయిన్గా నటించగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో మాత్రం అక్కినేని అఖిల్ అమెరికా ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఒక అమ్మాయిగా కామాక్షి కనిపించింది. ఆ తర్వాత రౌడీ బాయ్స్, మా ఊరి పొలిమేర, విరూపాక్ష చిత్రాల్లో నటించింది.

Also Read..

ఉదయం పెళ్లి పెట్టుకుని.. పవన్ కల్యాణ్ సినిమాకు వెళ్లిన మహేశ్ బాబు బావ!

Advertisement

Next Story