షారుఖ్ ఖాన్ దాటేసిన ప్రియాంక చోప్రా.. ఒక్క పోస్టుతో ఎంత సంపాదిస్తుందో తెలుసా?

by Anjali |   ( Updated:2023-10-02 08:21:51.0  )
షారుఖ్ ఖాన్ దాటేసిన ప్రియాంక చోప్రా.. ఒక్క పోస్టుతో ఎంత సంపాదిస్తుందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం నెటిజన్లు సోషల్ మీడియాకు ఎంతగా అడిక్ట్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గంటల తరబడి ఇంటర్నెట్ ప్రపంచంలో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో సరదాగా వీడియోలు చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇక సెలబ్రిటీలు అయితే భారీగానే రాబడుతున్నారని తెలుస్తోంది. స్టార్ హీరో, హీరోయిన్లు తమ వ్యక్తిగత విషయాలు, సినిమా అప్‌డేట్స్‌తో ఎప్పటికప్పుడు తమ అనుచరులతో పంచుకుంటారు. అయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్ చేసినందుకు ఏకంగా రూ.3 కోట్ల రూపాయలు ఆర్జిస్తుందట.

ఈ అమ్మడుకు ఇన్‌స్టాలో 89.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌ను సైతం వెనక్కు నెట్టి ప్రియాంక పెద్ద మొత్తంలో రాబడుతోందని జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రియాంక ఒక్కో యాడ్ పోస్ట్‌కు ఏకంగా రూ.3 కోట్లు సంపాదించడం విశేషం. ఇక కింగ్ షారుఖ్ మాత్రం ఒక్కో యాడ్ పోస్ట్‌కు రూ.80 లక్షల నుంచి కోటి వరకు అందుకుంటున్నారు. ఈ హీరోకు ఇన్‌స్టాగ్రామ్‌స్టాలో 42.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ వార్త విన్న నెటిజన్లు..‘ఏకంగా షారుఖ్‌నే క్రాస్ చేశావ్‌గా గ్లోబల్ బ్యూటీ’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Read More : బి అలర్ట్ ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ వచ్చేస్తోంది

Advertisement

Next Story