ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు కోట్లు వసూల్ చేస్తున్న సెలబ్రిటీలు

by samatah |   ( Updated:2023-05-30 10:11:36.0  )
ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు కోట్లు వసూల్ చేస్తున్న సెలబ్రిటీలు
X

దిశ, సినిమా: సోషల్ మీడియాలో సెలబ్రిటీలు తమ రోజువారీ జీవితానికి సంబంధించిన అప్ డేట్స్ అభిమానులపై ప్రేమతో పంచుకుంటారని అనుకుంటే పొరపడినట్లే. అవును ఇప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్‌లో 250 మిలియన్ల మంది ఫాలోవర్స్ మార్క్‌ను తాకిన భారతీయ క్రికెటర్ విరాట్ కోహ్లీ అభిమానుల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్ పెట్టడానికి రూ 3.5 నుంచి 5 కోట్లు వసూలు చేస్తాడు. భారీ ఫాలోయింగ్ కలిగిన బాలీవుడ్ తారలు కూడా తమ పోస్ట్‌లతో కోట్లు సంపాదిస్తున్నారు. ఈ లిస్ట్‌లో ప్రియాంక చోప్రా జోనస్‌కు 87.7 మిలియన్ ఫాలోవర్స్‌తో ముందుండగా.. పోస్ట్‌కు రూ.2 కోట్లు తీసుకుంటుంది. శ్రద్ధా కపూర్ 80.8 మిలియన్ ఫాలోవర్స్‌తో ఒక్క పోస్ట్‌కు రూ. 1.5 కోట్లు తీసుకుంటుంది. ఇక అలియా భట్ 77.4 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉండగా.. పోస్ట్‌కు రూ. 1.5- 2 కోట్లు వసూల్ చేస్తుంది. 74.1 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన దీపికా పదుకొణే రూ. 2 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Also Read..

కేవలం ఒక్క రూపాయికే సినిమా టికెట్..

Advertisement

Next Story