Adipurush: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-12-17 16:27:29.0  )
Adipurush: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : ఆది పురుష్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పేరే వినబడుతుంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకు డైరెక్షన్ చేసారు. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ రాముడు పాత్రలో , కృతిసనన్ సీత పాత్రలో నటించారు. సినిమాని బాగా ప్రమోట్ చేసేందుకు నిన్న రాత్రి తిరుపతిలో ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇంత వరకు లేని విధంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఊహకు కూడా అందని విధంగా లక్షకు పైగానే అభిమానులు హాజరయ్యారట. ఈ ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా చిన్న జీయర్ స్వామీజీ హాజరయ్యారు. అయితే ప్రస్తుతం ఈ ఈవెంటుకు సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అది ఏంటంటే.. ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం రూ.3 కోట్ల వరకు ఖర్చు చేశారట.

Advertisement

Next Story