షారుఖ్ ఖాన్ కుమారుడు ఇప్పటి వరకు ఎంతమందితో డేటింగ్ చేశాడో తెలిస్తే షాక్

by Anjali |   ( Updated:2024-01-25 07:12:12.0  )
షారుఖ్ ఖాన్ కుమారుడు ఇప్పటి వరకు ఎంతమందితో డేటింగ్ చేశాడో తెలిస్తే షాక్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్పిన అక్కర్లేదు. ఆర్యన్ ఖాన్ ఎప్పడు కూడా తండ్రిలా స్టార్ గుర్తింపు తెచ్చుకోవాలిని ఆశించడు. ఏదైనా సరే వేరే స్టైల్‌లో ప్రయత్నిస్తాడు. గత ఏడాది ‘స్టార్‌డమ్’ అనే వెబ్ సిరీస్‌తో తన తొలి దర్శకుడిగా ప్రకటించాడు. ఈ వెబ్ సిరీస్‌ను ప్రేక్షకులు బాగా ఆదరించడంతో ఆర్యన్ ఖాన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ వివాదాల్లో కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. దీంతో తండ్రిని మించిన తనయుడు అవుతాడనుకుంటే మరోలా ఉన్నాడేంటి? అంటూ నెట్టింట ఆర్యన్‌ను దారుణంగా ట్రోల్స్ చేశారు.

ఆర్యన్ డ్రగ్స్‌ కేసులో చిక్కుకుని ఎంతటి సంచలనం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తండ్రి ఏమో ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా గుర్తింపు తెచ్చుకుంటే కొడుకు ఇలా చేస్తున్నాడని షారుఖ్ ఫ్యాన్స్ మండిపడ్డారు. అయితే తాజాగా ఆర్యన్ 25 ఏళ్ల వయసులోనే చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ స్టార్ కిడ్ పలు సెలబ్రిటీస్‌తో పిక్స్ దిగుతూ సోషల్ మీడియాలో హైలెట్‌గా నిలుస్తాడు. పాకిస్తాన్ నటి కమ్ మోడల్ అయినా సాదియా ఖాన్‌తో డేటింగ్ లో ఉన్నాడంటూ ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. అప్పట్లో దుబాయ్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ నోరా ఫతే తో దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి.

దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని నెటిజన్లు భావించారు. కానీ ఆర్యన్ కన్నా నోరా వయసులో 5 ఏళ్లు పెద్దది. కాగా పలువురు ఈ వార్తలను కొట్టిపారేశారు. అంతకన్నా ముందు అనన్య పాండేతో కూడా ఆర్యన్ ఖాన్ డేటింగ్ లో ఉన్నాడని చర్చించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ‘అనన్య’ కాఫీ విత్ కరణ్ షో లో ఒప్పుకుంది కూడా. ఆర్యన్ అనన్యకు క్రష్ ఉందని, అతడు చాలా క్యూట్ గా ఉంటాడని చెప్పుకొచ్చింది. ఇక సోషల్ మీడియాలోని జనాలు కుదురుగా ఉంటారా? వీరిద్దరికి కూడా ఓ రిలేషన్ అంటగట్టి.. జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆర్యన్ పై నెట్టింట వచ్చే ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం నెట్టింట వైరల్ అవుతుంది.

Advertisement

Next Story