- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొలి ప్రేమ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ చిత్రం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ కీర్తీ రెడ్డి అందరికీ గుర్తుండే ఉంటుంది. అందయం అభినయంతో ఈముద్దుగుమ్మ ఎంతో మంది అభిమానులను కూడగట్టుకుంది. నాగర్జునతో రావోయి చందమామ, మహేష్ బాబు అర్జున్ సినిమాలో అక్కగా నటించి ప్రేక్షకుల నుంచి మన్ననలు పొందింది. తర్వాత అక్కినేని హీరో సుమంత్‌ను ప్రేమ వివాహం చేసుకొని , కొంత కాలంలోనే విడాకులు తీసుకొని విడిపోయింది. ఇక ఆ తర్వాత ఈ అమ్మడు సినిమాలకు గుడ్ బై చెప్పి తన అభిమానులకు దూరమైంది.
అయితే చాలా రోజుల తర్వాత ఈ అమ్మడు ఓ ఫంక్షన్‌లో మెరిసింది. ఓ ఎన్నారైని రెండో పెళ్లి చేసుకున్న కీర్తి, భర్తతో కలిసి అమెరికాలో స్థిరపడి కుంటుంభానికే అంకితం అయ్యింది. అయితే చాలా రోజుల తర్వాత ఈముద్దుగుమ్మ ఇండియాకు వచ్చి ఓ ఫంక్షన్‌లో మెరిసింది. వేడుకలో సమంత స్నేహితురాలు, ఫిట్ నెస్ ట్రైనర్ శిల్పారెడ్డి తో కలిసి దిగిన ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. కీర్తి రెడ్డి లేటెస్ట్ ఫోటో బయటకు రావడంతో.. ఇప్పటికీ కీర్తి అలాగే ఉందని పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలకు తల్లి అయిన కీర్తి అందం మాత్రం ఏమాత్రం తరగలేదు అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : "శాకుంతలం" సినిమాకు షాక్ ఇచ్చిన దిల్ రాజు