Surya-Jyothika ఎలా Love లో పడ్డారో తెలుసా..? ఆ రాత్రి ఆయన తిట్టకపోతే..! (వీడియో)

by Nagaya |   ( Updated:2023-10-02 09:15:10.0  )
Surya-Jyothika ఎలా Love లో పడ్డారో తెలుసా..? ఆ రాత్రి ఆయన తిట్టకపోతే..! (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : సూర్య. ఈ పేరు చెబితే తెలియని వాళ్లు అంటూ ఉండరు. అటు తమిళ్, ఇటు తెలుగులోనూ సూర్యకు ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సూర్యకు ఇప్పుడున్నా క్రేజ్ అంత ఈజీగా వచ్చిందేమి కాదు. తండ్రి హీరో అయినా ఆయనెప్పుడూ షూటింగ్‌ చూసేందుకు వెళ్లలేదు. నటనపై ఆసక్తి చూపలేదు. కానీ, పరిస్థితుల ప్రభావం వల్ల ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక తప్పలేదు. కెరీర్‌ ప్రారంభంలో నటుడిగా విమర్శలు ఎదుర్కొన్న ఆయన ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడెందరికో ఆదర్శంగా నిలిచారు. నటనకు పెట్టింది పేరు అని నిరూపించుకున్నారు.

సూర్య అసలు పేరు శరవణన్‌. ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఆ పేరును సూర్యగా మార్చారు. మణిరత్నం తెరకెక్కించిన ‘దళపతి’ సినిమాలోని రజనీకాంత్‌ పోషించిన పాత్ర పేరు అది. మరో విశేషమేంటంటే.. సూర్య తొలి సినిమా ‘నేరుక్కు నేర్‌’లోని తొలి షాట్‌కి మణిరత్నమే దర్శకత్వం వహించి నిర్మాతగా వ్యవహరించారు. వసంత్‌ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమాలో హీరో విజయ్‌‌తో కలిసి నటించారు సూర్య. ఇదే పేరుతో నాలుగు సినిమాల్లో కనిపించారు.

తన తండ్రి శివ కుమార్‌ అప్పట్లో హీరో అయినా సినిమాల్లోకి వచ్చేందుకు సూర్య అంతగా ఆసక్తి చూపేవారు కాదు. కాలేజీ రోజుల్లో జరిగిన ఓ సంఘటనతో నటనవైపు వెళ్లకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. దీనికి ప్రధాన కారణం రంగస్థల నాటక సంఘంలో చేరిన సూర్య తనని తాను పరిచయం చేసుకునేందుకు వణుకుతూనే మైక్‌ పట్టుకుని, మాట్లాడడం ప్రారంభించారు. హలో Iam శరవణన్‌, డూయింగ్‌ మై డూకామ్‌’’ అని చెప్పారు. బీకామ్‌కి బదులు డూకామ్‌ అనడంతో ఆడిటోరియం మొత్తం నవ్వింది. నలుగురిలో మాట్లాడాలంటే భయంకావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్టింగ్‌ వైపు వెళ్లకూడదని ఫిక్స్‌ అయ్యారు.

సూర్య డిగ్రీ పూర్తి చేసే సమయానికి శివ కుమార్‌ హీరో నుంచి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారారు. ఆర్థిక సమస్యలు తలెత్తడంతో సూర్య ఓ గార్మెంట్‌ కంపెనీలో ఉద్యోగం చేశారు. రెండు నెలలకుగాను రూ.1200 శాలరీ తీసుకొని, తొలి సంపాదనతో వాళ్లమ్మకు చీరకొన్నారు. కొన్నాళ్ల తర్వాత అప్పుచేసి సొంత కంపెనీ పెట్టారు. వ్యాపారం బాగానే ఉన్నా ఆ రంగంపై ఆసక్తి చూపలేకపోయారు. అప్పు తీర్చేందుకు ఆయన సినిమాని మార్గంగా ఎంచుకున్నారు.

సూర్యలో మార్పురావడానికి ప్రధాన కారణం నటుడు రఘువరన్‌. ఓసారి వీరిద్దరు రైలు ప్రయాణం చేశారు. గాఢ నిద్రలో ఉన్న సూర్యని లేపి ‘ఎలా నిద్రపడుతోందిరా నీకు. ఏం సాధించావని? ఇంకా ఎంతకాలం మీ నాన్న పేరు చెబుతూ ఇండస్ట్రీలో బతుకుతావ్‌?’ అని రఘువరన్‌ సూర్యని అన్నారట. ఆ మాటలకు బాధపడిన సూర్య నటనపై శ్రద్ధ పెట్టారు.

ప్రపంచంలోని గొప్ప సినిమాలన్నీ చూసి ఏ హావభావాన్ని ఎలా ప్రదర్శించాలో నేర్చుకున్నారు.నటన మెరుగుపడ్డా.. పక్కవారితో మాట్లాడాలంటే ఇబ్బంది పడేవారు. ‘పూవెల్లాం కేటుప్పార్‌’ సినిమా షూటింగ్ టైంలో మీ కళ్లు చాలా బాగుంటాయి’ అని హీరోయిన్‌ జ్యోతిక సూర్యతో అన్నారట. ఓ అమ్మాయి నుంచి నేను అందుకున్న తొలి కాంప్లిమెంట్‌ అదే అని అప్పట్లో పలు ఇంటర్వ్యూల్లో ఆనందం వ్యక్తం చేశారు సూర్య. కొన్ని సినిమాల్లో కలిసి నటించిన ఈ ఇద్దరు ప్రేమించి, పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు. సూర్య సోదరుడు కార్తీ కూడ హీరో అనే విషయం అందరికీ తెలిసిందే.

ఇతర హీరోలకు సంబంధించి సూర్య డబ్బింగ్‌ చెప్పిన ఏకైక సినిమా గురు. బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తమిళ వెర్షన్‌కు సూర్య డబ్బింగ్ చెప్పారు. రానా హీరోగా వచ్చిన ‘ఘాజీ’కి తమిళంలో వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. వ్యాఖ్యాతగా గాయకుడుగా నిర్మాతగా, ఇలా అడుగుపెట్టిన ప్రతి విభాగంలో తనదైన మార్క్‌ చూపించారు. జీరోవా? జీరోవా? వంటి లఘు చిత్రాల్లో, స్పిరిట్‌ ఆఫ్‌ చెన్నై వంటి మ్యూజిక్‌ వీడియోల్లోనూ సూర్య నటించారు. ఆస్కార్‌ అవార్డ్స్‌ కమిటీలోకి ఆహ్వానితుడిగా వెళ్లిన First south indiyan actor సూర్య. ఆ సంస్థ యూట్యూబ్‌ ఛానెల్‌లో స్థానం దక్కించుకున్న First indiyan సినిమా జై భీమ్‌ సూర్యదే.

సమాజ సేవ చేయడంలో ముందుండే సూర్య ‘అగరం ఫౌండేషన్‌’ స్థాపించి, పేద పిల్లలకు ఉచితంగా ఉన్నత విద్య అందిస్తూ, వారిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. మార్కుల్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకుండా ఆ పిల్లల నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఇప్పటి వరకు వేల సంఖ్యలో విద్యార్థులకు సాయమందించారు. ‘జై భీమ్‌’ సినిమా దర్శకుడు టీజే జ్ఞానవేలు నిరుపేద విద్యార్థులకు చేసే సాయాన్ని గుర్తించిన సూర్య ఆయనతో కలిసి అగరం ఫౌండేషన్‌ ప్రారంభించారు.

సుమారు 26 ఏళ్ల నట ప్రస్థానంలో సూర్య జాతీయ అవార్డుతో సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు. నటులకు సంబంధించిన ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో బెస్ట్‌ యాక్టర్‌, బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌, బెస్ట్‌ యాక్టర్‌ క్రిటిక్స్‌ ఛాయిస్‌ అనే మూడు విభాగాల్లోనూ అవార్డ్ అందుకున్న ఏకైక నటుడు సూర్య. ప్రస్తుతం.. భారీ బడ్జెట్‌ చిత్రం ‘కంగువా’తో బిజీగా ఉన్న సూర్య 23 జులైతో 48 సంవత్సరాలు పూర్తిచేసుకున్నాడు. దీంతో సూర్య ఫాన్స్ సోషల్ మీడియాలో Happy birth day my hero అంటూ birth day విశేష్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి :: Shah Rukh Khan : షారుఖ్‌కు భార్య గౌరీ అంటే అంత భయమా?

Advertisement

Next Story

Most Viewed