పూనమ్ పాండే తెలుగులో నటించిన సినిమా ఏదో తెలుసా?

by Jakkula Samataha |
పూనమ్ పాండే తెలుగులో నటించిన సినిమా ఏదో తెలుసా?
X

దిశ, సినిమా : వివాదాస్పద నటి పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్‌తో కన్నుమూసినట్లు తెలుస్తోంది. పూన‌మ్ పాండే మ‌ర‌ణించిన‌ట్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లోనే పోస్ట్ క‌నిపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇక నిన్న, మొన్నటి వరకు నవ్వుతూ ఈవెంట్స్‌లో కనిపించిన ఈ నటి చనిపోయిందనే వార్త రావడం తన అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతి‌కి గురిచేస్తుంది.దీంతో పూనమ్‌కు సంబంధించిన అనేక వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక పూనమ్ పాండే బాలీవుడ్‌లోనే కాకుండా, తెలుగు,తమిళ భాషల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. కాగా, పూనమ్ తెలుగులో నటించి మూవీ ఏమిటంటే? నటుడు సామ్రాట్ హీరోగా, 2015లో వచ్చిన మాలిని అండ్ కో సినిమాలో పూనమ్ హీరోయిన్‌గా నటించింది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోయే సరికి పూనమ్‌కు టాలీవుడ్‌లో అంతగా గుర్తింపు రాలేదు. దీంతో ఈ అమ్మడు టాలీవుడ్ ‌పై అంతగా ఫొకస్ పెట్టలేదు.

Advertisement

Next Story