JR.NTR: ప్లాప్ టాక్ తెచ్చుకొని సూపర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ సినిమా ఏదో తెలుసా?

by samatah |   ( Updated:2023-05-25 15:32:32.0  )
JR.NTR: ప్లాప్ టాక్ తెచ్చుకొని సూపర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ సినిమా ఏదో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : సినిమాల్లో హిట్స్, ప్లాప్స్ చాలా కామన్. ఏ సినిమా డిజాస్టర్ అవుతుంది, ఏ సినిమా మంచి హిట్ అందుకుంటుందో ఎవరూ చెప్పలేరు. అయితే జూనీయర్ ఎన్టీఆర్ నటించిన ఓ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకొని అనూహ్యంగా సూపర్ హిట్ అందుకుందంట. ఇంతకీ ఆ సినిమా ఏదీ అనుకుంటున్నారా?

టెంపర్ సూపర్ హిట్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన చిత్రం నాన్నకు ప్రేమతో. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది.భారీ అంచ‌నాల న‌డుమ 2016 సంక్రాంతి పండుగ కానుక‌గా జ‌న‌వ‌రి 13 ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే నిజానికి ఈ సినిమాపై మొద‌ట నెగ‌టివ్ టాక్ వ‌చ్చింది. ప్రీమియ‌ర్ షోలు చూసిన ప్రేక్ష‌కులు రొటీన్ రివేంజ్ డ్రామా అంటూ పెద‌వి విరిచారు. కానీ, అనూహ్యంగా సాయంత్రానికి నెగ‌టివ్ టాక్ కాస్త పాజిటివ్ గా మారింది. ప్రేక్షకులకు కూడా సినిమా నచ్చడంతో సూపర్ హిట్ అందుకుంది.

Also Read..

Fatima Sana Shaikh With Aamir Khan :అమీర్ ఖాన్‌తో డేటింగ్‌పై స్పందించిన సనా..

Advertisement

Next Story