DJ Tillu Sidhu : రవితేజ సినిమాలో డీజే టిల్లు.. ఇక ఊరమాసేనా?

by Jakkula Samataha |
DJ Tillu Sidhu : రవితేజ సినిమాలో డీజే టిల్లు.. ఇక ఊరమాసేనా?
X

దిశ, సినిమా : మాస్ మహారాజ రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో బాలీవుడ్ మూవీ రైడ్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు15న థియేటర్లలో రిలీజ్ కానుంది.ఈ మూవీలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్స హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని సాంగ్స్‌లో భాగ్య శ్రీ, రవితేజ కెమిస్ట్రీ‌కి మంచి మార్కులు పడ్డాయి. దీంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కాగా, తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? ఈ మూవీలో డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా కపించనున్నాడంట అయితే ఈయన ఓ గెస్ట్‌రోల్‌లో కనిపించనన్నట్లు సమాచారం. రవితేజతో కొన్ని నిమిషాల పాటు సిద్ధు స్క్రీన్ పై కనిపిస్తాడంట. వీరిద్దరి మధ్య సీన్స్ హైలెట్‌గా సర్‌ప్రైజింగ్‌గా ఉండేలా మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం ఈ న్యూస్ ప్రేక్షకులలో మరింత ఆసక్తిని రేపుతోంది.

Advertisement

Next Story

Most Viewed