- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Surya and Jyothika : సూర్యతో విడాకులు..ఒక్క పోస్ట్‌తో బిగ్ ట్విస్ట్ ఇచ్చేసిన జ్యోతిక!
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, జ్యోతిక ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి మరీ 2006లో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే సూర్య, జ్యోతిక వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. గత కొద్ది కాలంగా వీరిద్దరు విడాకులు తీసుకుని విడిగా ఉంటున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల జ్యోతిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పిల్లల చదువుల కోసం, షూటింగ్ కోసం ముంబైకి వచ్చామని చెప్పింది.
అయినప్పటికీ అధికారికంగా ఏ పోస్ట్ పెట్టకపోవడంతో ఫ్యాన్స్‌లో అనుమానాలు అలాగే ఉండిపోయాయి. వారు ఎక్కడ విడాకులు తీసుకుని విడిపోతారేమోనని తెగ కంగారు పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా, జ్యోతక తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఫిన్‌ల్యాండ్‌లోని మంచులో సూర్యతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపింది. అలాగే వారిద్దరు సన్నిహితంగా ఉన్న కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసింది. దీంతో అది చూసిన ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకుంటున్నారు. అంతేకాకుండా మీరిద్దరు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కామెంట్లు పెడుతున్నారు.