కేరళ స్టోరీ బ్యూటీ కోసం క్యూ కడుతున్న ఆఫర్లు!

by Anjali |   ( Updated:2023-06-27 05:01:54.0  )
కేరళ స్టోరీ బ్యూటీ కోసం క్యూ కడుతున్న ఆఫర్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదాశర్మ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని పేరు. ఇండస్ట్రీలోకి హార్ట్ ఎటాక్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ పలు సినిమాల్లో నటించారు. పదేళ్లకు పైగా టాలీవుడ్‌లో కొనసాగుతున్నా.. ఇప్పటివరకు ఆమెకు చెప్పుకోదగ్గ సినిమాల పడలేదు. కానీ, తాజాగా.. ‘ది కేరళ స్టోరీ’ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది ఆదాశర్మ. ఏ అంచనాలు లేకుండా విడుదలై దేశ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి అన్ని ఇండస్ట్రీల దృష్టిని ఆకర్షించింది. వివాదాస్పద అంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆదరించారు. ఈ మూవీ హి‌ట్ కావడంతో దర్శక, నిర్మాతలు ఈ అందాల భామతో తెలుగులో ఓ క్రేజీ ఫీమెల్ సెంట్రిక్ సినిమా తీయాలనుకుంటున్నారట. కెరీర్ దాదాపు ముగిసింది అనుకునే సమయంలో ఆదా శర్మకు ఈ ది కేరళ స్టోరీ మూవీ ఆమెని తన టాలెంట్‌ చూపించేలా చేసింది. దీంతో ఆమె మరిన్నీ అవకాశాలు అందుకుంటోంది.

Also Read: విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్మెంట్ ఎప్పుడో తెలుసా?

Advertisement

Next Story