ఉదయ్ కిరణ్ డెత్ పై డెరెక్టర్ తేజ సంచలన కామెంట్స్

by Javid Pasha |   ( Updated:2023-05-25 06:37:43.0  )
ఉదయ్ కిరణ్ డెత్ పై డెరెక్టర్ తేజ సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఉదయ్ కిరణ్ మృతిపై టాలీవుడ్ డైరెక్టర్ తేజ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తాజా సినిమా ‘అహింస’ ప్రమోషన్ లో భాగంగా ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయారో, దానికి కారణం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసునని .. కానీ చాలా మంది ఏం తెలియనట్లు నటిస్తున్నారని అన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఉదయ్ కిరణ్ అంత చిన్న వయసులో చనిపోవడం చాలా బాధాకరమని తేజ అన్నారు.

కాగా డైరెక్టర్ తేజ, ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో చిత్రం, నువ్వు నేను, ఔనన్నా కాదన్నా సినిమాలు వచ్చాయి. ఇక చిత్రం, నువ్వు నేను సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇక ‘అహింస’ మూవీ విషయానికొస్తే దగ్గుబాటి రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ఇందులో హీరోగా చేస్తున్నారు. ఆర్పీ పట్నాయక్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక దగ్గుబాటి రానాతో తేజ ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే సినిమాను చేశారు.

Advertisement

Next Story