అగ్ర నిర్మాత కొడుకుని ఏకి పారేసిన డైరెక్టర్ తేజ.. నీ బ్యాక్‌గ్రాండ్ ఏదైనా నాకేంటి అంటూ ఫైర్

by sudharani |   ( Updated:2023-05-28 09:14:30.0  )
అగ్ర నిర్మాత కొడుకుని ఏకి పారేసిన డైరెక్టర్ తేజ.. నీ బ్యాక్‌గ్రాండ్ ఏదైనా నాకేంటి అంటూ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: దగ్గుబాటి రానా తమ్ముడు.. దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘అహింస’. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ తేజ దర్శకత్వం వహించారు. సినిమా రిలీజ్ సమయం దగ్గర పడడంతో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటుంది చిత్ర బృందం. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అభిరామ్.. డైరెక్టర్ తేజ గురించి, సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

అభిరామ్ మాట్లాడుతూ.. ‘‘డైరెక్టర్ తేజ నాన్నని కలిసి కథ చెప్పారు. హీరోగా నన్ను లాంఛ్ చేయడానికి ఈ కథ సరిగ్గా సరిపోతుందని నాన్న అన్నారు. ఇక సినిమా షూట్ చేస్తున్నప్పుడు తేజ.. నన్ను అందరి ముందు మైక్‌లో తిట్టారు. ‘నీ బ్యాక్‌గ్రాండ్ ఏదైనా నాకు సంబంధం లేదు. ఆడియన్స్ కోసమే నేను ఈ సినిమా చేస్తున్నా. కాబట్టి ఫోకస్ పెట్టి నటించు’ అని కేకలు వేశారు. ఒక సీన్‌లో అయితే ప్రమాదవశాత్తు నేను కిందపడిపోయాను. మోకాళ్లకు దెబ్బలు తగిలాయి. దాదాపుగా ఆరు నెలలపాటు బెడ్ రెస్ట్ తీసుకున్నాను. ఇక విడుదల సమయం దగ్గరపడుతున్న కొద్దీ చాలా కంగారుగా అనిపిస్తుంది. ఆ భయంతో రాత్రి సమయంలో నిద్ర కూడా పట్టడం లేదు’’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా.. జూన్ 2 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.

Also Read..

శవాల మీద పేలాలు ఎరుకునే జీవితం నీది.. అరియానాపై దారుణమైన కామెంట్స్

Advertisement

Next Story