మీ అంత క్యాలిబర్ ఉన్న రైటర్‌కు ఇది కూడా అర్థం కాలేదా.. రైటర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సందీప్ వంగ

by sudharani |   ( Updated:2024-01-09 10:01:32.0  )
మీ అంత క్యాలిబర్ ఉన్న రైటర్‌కు ఇది కూడా అర్థం కాలేదా.. రైటర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సందీప్ వంగ
X

దిశ, సినిమా: ‘యానిమల్’ సినిమాతో బాలీవుడ్‌కి సూపర్ సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ వంగ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆయన.. తన సినిమాలకు ఎవరైనా అర్థంలేని విమర్శలు చేస్తే వారికి సాలిడ్ ఆన్సర్స్ ఇస్తుంటాడు. ఈ క్రమంలోనే యానిమల్ సినిమాలో ఓ సన్నివేశాన్ని గూర్చి ‘ఒక అబ్బాయి అమ్మాయిని తన బూట్లు నాకమని చెప్తున్నాడు.. అమ్మాయిని కొడుతున్నాడు.. ఆ సినిమా సూపర్ హిట్ కూడా అయింది. అంటే అలాంటి సినిమా చాలా డేంజర్’ అంటూ బాలీవుడ్ స్టార్ రైటర్ జావేద్ అక్తర్ షాకింగ్ ట్వీట్ పెట్టాడు.

దీనిపై స్పందించిన సందీప్ వంగ.. యానిమల్ మూవీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా స్పందిస్తూ ‘ఒక అమ్మాయిని అబ్బాయి మోసం చేసినప్పుడు.. ఆ అమ్మాయి అబ్బాయిని తన బూట్లు నాకమని చెప్తే మీరంతా ఫెమినిజం పేరుతో చప్పట్లు కొడతారు. అదే విధంగా ఓ అమ్మాయి అబ్బాయిని మోసం చేసింది. దీంతో కోపంలో ఉన్న ఆ వ్యక్తి అమ్మాయిని బూట్లు నాకమని చెప్పాడు అంతే. జోయా, రన్విజయ్ మధ్య జరిగింది ఇదే. దాన్ని ఇలాగే తీసుకోవాలి. ప్రేమకి జెండర్ పాలిటిక్స్‌ని తీసుకు రాకండి. మీ అంత క్యాలిబర్ ఉన్న రైటర్ కూడా ఇది తెలుసుకోలేకపోతున్నారు అంటే.. మీరు ఇన్ని రోజులు రాసింది అంతా అబద్ధమే’ అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. అయితే ట్వీట్‌లో రైటర్ పేరు మెన్షన్ చేయలేదు కానీ.. ఆ ట్వీట్‌లో ఇండరైక్ట్‌గా జావేద్ అక్తర్‌నే అన్నాడు అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story