- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయ్యో బాబు బిగుసుకుపోయాడు పాపం.. ఇద్దరమ్మాయిల మధ్య నలిగిపోతున్న జాతిరత్నాలు డైరెక్టర్.(వీడియో)
దిశ, సినిమా: డైరెక్టర్ అనుదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతనికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నవీన్ పొలిశెట్టి హీరోగా ఫరియా అబ్దల్లా హీరోయిన్‌గా తెరకెక్కించిన ‘జాతిరత్నాలు’ అనే మూవీతో డైరెక్టర్ అనుదీప్ సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా బుల్లితెరపై క్యాష్ అనే ప్రోగ్రామ్‌లో పాల్గొని అనుదీప్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఇక ఈ షోతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. అలాగే బయట ఈవెంట్లలో అనుదీప్ కనిపించే తీరు.. మాట్లాడే విధానం చూస్తే అందరికి నవ్వులు తెప్పిస్తాయి. అయితే ఇతని కామెడీ టైమింగ్స్‌కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని అనడంలో ఏమాత్రం అతియోశక్తి లేదు. అలా తన కామెడీతో ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తుండంతో.. గత కొన్ని రోజులుగా పలు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు అనుదీప్‌ను అతిథిగా పిలుస్తున్నారు. ఈ క్రమంలో అనుదీప్‌కు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది..
ఇదిలా ఉంటే.. తాజాగా అనుదీప్ ‘ఆయ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా వెళ్లారు. ఆ వేడుకలో అనుదీప్‌కు ఓవైపు హీరోయిన్ శ్రీ లీల, మరోవైపు సింగర్ మంగ్లీ కూర్చున్నారు. అప్పుడు అనుదీప్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మాములుగా లేవు. ఇద్దరి మధ్య కూర్చోవడం ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్లు ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. నిజానికి అనుదీప్ ఇంట్రోవర్ట్.. ఆయన తెరకెక్కించే సినిమాలు కడుపుబ్బా నవ్వించినా అనుదీప్ మాత్రం బయట చాలా ఇంట్రోవర్ట్ అనే విషయం తెలిసిందే. ఇక ఆయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనుదీప్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్‌కి సాంప్రదాయనీ.. సుప్పినీ.. సుద్దపూసిని అనే సాంగ్‌ను ఎడిట్ చేసి పోస్ట్ చేశారు. దానిని చూస్తున్న నెటిజన్లు.. బాబు బిగుసుకుపోయాడు పాపం అని.. అయ్యాయో మన డైరెక్టర్‌కి ఎంత కష్టమొచ్చిందిగా అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
(video link credits to artistrybuzz instagram id)