- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చిత్ర సీమలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో దర్శకుడు మృతి
దిశ, సినిమా: టాలీవుడ్ చిత్ర సీమలో వరుసగా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ జర్నలిస్ట్, సినీ దర్శకుడు కె. జయదేవ్ సోమవారం రాత్రి గుండెపోటుతో హైదరాబాదులో మరణించారు. జయదేవ్ పలు షార్ట్ ఫిలింస్‌కు దర్శకత్వం వహించారు. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘కోరంగి నుంచి’ అనే చిత్రానికి మంచి పేరు వచ్చింది. ఈ సినిమాను నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎఫ్‌డీసీ) నిర్మించింది. మంచి చిత్రాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎన్‌ఎఫ్‌డీసీ ప్రతి సంవత్సరం కొన్ని మూవీస్‌కు ఫండింగ్ ఇస్తుంది.
'కోరంగి నుంచి' సినిమాకు ఏకంగా కోటి రూపాయల ఫండింగ్ ఇచ్చారు. 25 ఏళ్ల తర్వాత నటి అర్చన ఈ చిత్రంలో నటించింది. ఈ సినిమాకు పలు జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. ప్రముఖ దర్శకుడు, జర్నలిస్టు కేఎన్‌టీ శాస్త్రికి జయదేవ్ చిన్న కుమారుడు. జయదేవ్‌కు భార్య యశోద, కుమారుడు, కుమార్తె ఉన్నారు.