అనుదీప్‌-న‌వీన్ పొలిశెట్టిల కాంబోలో మరో సినిమా?

by sudharani |   ( Updated:2023-09-13 11:23:47.0  )
అనుదీప్‌-న‌వీన్ పొలిశెట్టిల కాంబోలో మరో సినిమా?
X

దిశ, సినిమా: ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీతో హ్యాట్రిక్ హిట్‌ అందుకున్నాడు హీరో న‌వీన్ పొలిశెట్టి. అనుష్క హీరోయిన్‌గా స‌రోగ‌సీ కాన్సెప్ట్‌తో ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. ఈ మూవీలో స్టాండ‌ప్ క‌మెడియ‌న్‌గా న‌వీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌, పంచ్ డైలాగ్స్‌ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. అనుష్కకంటే నవీన్ యాక్టింగ్‌కే ఎక్కువగా ప్రశంస‌లు ల‌భిస్తున్నాయి.

తాజాగా నవీన్ పొలిశెట్టి అప్ కమింగ్ మూవీపై అందరి దృష్టి పడింది. ప్రజంట్ వెంక‌టేష్‌తో అత‌డు ఓ సినిమా చేయ‌బోతున్నట్లు ప్రచారం జ‌రుగుతున్నప్పటికి వెంక‌టేష్ మాత్రం ‘సైంధ‌వ్’తో బిజిగా ఉన్నాడు. ఇకపోతే ‘జాతిర‌త్నాలు’ దర్శకుడు అనుదీప్‌ కాంబోలో ఒక మూవీ రాబోతుందట. త్వరలొనే దీనిపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story