Leprosy: కుష్టు వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్

by Sujitha Rachapalli |
Leprosy: కుష్టు వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా : లెజెండరీ యాక్ట్రెస్ డింపుల్ కపాడియా ఒకప్పుడు బాలీవుడ్‌ను ఏలింది. 12 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆమె... టీనేజ్ లవ్ స్టోరీ 'బాబీ'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తొలి సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయగలిగింది. ఇక ఆ తర్వాత వరుస ఆఫర్లు క్యూ కట్టగా చాలా తక్కువ సమయంలోనే స్టార్ రేంజ్ అందుకుంది. అయితే ఫస్ట్ మూవీ ఆడిషన్స్ టైంలో తను కుష్టు వ్యాధితో బాధపడినట్లు తెలిపింది కపాడియా. తన మోచేతిపై కుష్టు లక్షణాలు చూసిన డాడీ ఫ్రెండ్ అయిన ప్రముఖ డైరెక్టర్ తనను స్కూల్ నుంచి తీసేయిస్తానని వార్నింగ్ ఇచ్చాడని చెప్పింది. ఆ టైంలో తనకు ఏమీ అర్థం కాలేదని వివరించింది.

ఇక అదే సమయంలో డైరెక్టర్ రాజ్ కపూర్ బాబీ మూవీ ఆడిషన్స్ జరుగుతున్నాయి. పేపర్లో కూడా దీని గురించి వార్తలు రాగా.. ఆ బాబీ తనే అని ఫ్రెండ్స్ తో చెప్పానని, ఆడిషన్స్‌కు వెళ్తే ఫస్ట్ టైం రిజెక్ట్ అయ్యానని తెలిపింది. రాజ్ కపూర్ కొడుకు రిషి కపూర్‌ను ఈ సినిమా ద్వారానే ఇంట్రడ్యూస్ చేస్తుండగా.. హీరో కన్నా తను పెద్దగా కనబడుతున్నాననే ఉద్దేశంతో వద్దన్నారని చెప్పింది. కానీ మళ్లీ ఆయనే పిలిచి అవకాశం ఇచ్చారని.. ఇదంతా మ్యాజికల్‌గా జరిగిపోయిందని వివరించింది డింపుల్.

Advertisement

Next Story