- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Game Changer: గేమ్ ఛేంజర్ రిలీజ్ పై దిల్‌రాజు కీలక అప్డేట్
దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత గేమ్ ఛేంజర్ మూవీ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా వేచి చూస్తున్నారు. శంకర్ డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చిత్ర షూటింగ్ ముగింపు దశకి వచ్చింది. ఇక ఎప్పుడు థియేటర్లలో రిలీజ్ అవుతుందా అని సినీ ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తోంది. తాజాగా ఓ ఈవెంట్లో నిర్మాత దిల్‌రాజ్ రిలీజ్ పై కీలక అప్డేట్ ఇచ్చారు.
‘రాయన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గెస్ట్ గా హాజరైన దిల్ రాజ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ గురించి ఒక క్లారిటీ ఇచ్చారు. స్టేజ్‌పైకి ఎక్కగానే దిల్ రాజును, ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ విడుదల ఎప్పుడంటూ గోల గోల చేసి అడిగారు. దీనికి జవాబు చెప్తూ.. గేమ్ ఛేంజర్ మూవీ క్రిస్మస్ కానుకగా మీ ముందుకు రాబోతుందని తెలిపారు. దీంతో రామ్ చరణ్ అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
తెలుగులో శంకర్ డైరెక్షన్ చేస్తున్న మొదటి మూవీ కావడంతో ప్రేక్షకులు వేయి కళ్ళతో వేచి చూస్తున్నారు. దీని గురించి శంకర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నా సినిమాలను తెలుగు వారు ఆదరించారు. తెలుగులో ఒక్క సినిమా అయినా చేయాలనీ ఎప్పటి నుంచో అనుకున్నాను దాని కోసం చాలా సార్లు ప్రయత్నాలు కూడా చేసా.. అది ఫెయిల్ అయింది. ‘గేమ్ ఛేంజర్’తో నా కల నెరవేరబోతున్నందుకు సంతోషంగా ఉందంటూ శంకర్ చెప్పుకొచ్చారు.