- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెగాస్టార్ చిరంజీవికి దిల్ రాజు సపోర్ట్.. వైసీపీ నేతలపై పరోక్ష విమర్శలు
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవిపై విమర్శలు చేస్తున్న వైసీపీ మంత్రులకు, లీడర్లకు ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు కీలక సూచనలు చేశారు. గురువారం దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవి మంచి ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని అన్నారు. సానుకూల దృక్పథంతో ఉంటే అన్నీ అర్ధం అవుతాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరు వ్యాఖ్యలను అందరూ పాజిటివ్‌గా తీసుకోవాలని కోరారు. కాగా, వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్‌లో చిరంజీవి ఏం మాట్లాడారంటే.. ‘‘ఎంతసేపు సినిమా ఇండస్ట్రీ గురించి కాదు.. ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, పేదవారికి కడుపు నింపేలా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి వాటి గురించి ఆలోచిస్తే మంచిదన్నారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు పడతారు’’ అని చిరు వ్యాఖ్యానించారు. దీనిపై వైసీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుండగా.. దిల్ రాజు చిరంజీవికి మద్దతిస్తూ ప్రభుత్వ పెద్దలకు కీలక సూచనలు చేశారు.
Read More..
మెగాస్టార్ చిరంజీవిపై టీడీపీ అస్త్రం: చంద్రబాబు వ్యూహం ఫలించేనా?
సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు.. మెగాస్టార్‌కు YCP ఎంపీ కౌంటర్