- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బలగం’ వేణుకి పాన్ ఇండియన్ ఫిల్మ్ ఆఫర్ !.. వైరల్ అవుతున్న దిల్ రాజు మాటలు
దిశ, సినిమా: టాలీవుడ్‌లో చిన్న సినిమాగా విడుదలైన ‘బలగం’ పెద్ద విజయాన్ని సాధించింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, ఆచారాలు, మానవ సంబంధాలను కళ్లకు కట్టినట్లు చూపించడంతో ఈ మూవీ జనం గుండెల్లో నాటుకు పోయే భావోద్వేగాన్ని కలిగించింది. జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక నిర్మాత దిల్ రాజు విషయానికి వస్తే.. ఆయన ట్యాలెంట్ ఉన్న చోటనే కనిపిస్తుంటారు.
ఫలానా వారికి టాలెంట్ ఉందని తెలిస్తే.. నమ్మి సినిమా తీస్తాడు. ఎలాంటి రిస్క్ ఎదురవుతుందని తెలిసినా కమిట్ అవుతాడు. ‘బలగం’ విషయంలోనూ అదే చేశాడు దిల్ రాజు. వేణు రూపంలో మరో బెస్ట్ డైరెక్టర్‌ను టాలీవుడ్‌కు దొరికేలా చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు.. వేణుకి సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాలు పంచుకున్నాడు ‘‘రీసెంట్‌గా వేణు నన్ను కలిసి.. మూవీ గురించి ఒక లైన్ చెప్పాడు. అది నాకు బాగా నచ్చింది. వెంటనే స్క్రిప్ట్ రెడీ చేస్కో అన్నాను. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో తీద్దామని చెప్పాను’’ అంటూ దిల్ రాజు చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి: ప్రభాస్ వల్లే నా కెరీర్ ముగిసిపోయింది.. బలగం దర్శకుడు వేణు సంచలన వ్యాఖ్యలు