దిల్‌రాజు ఆ రోజు నన్ను దారుణంగా తిట్టాడు : సుకుమార్

by Kavitha |   ( Updated:2024-03-05 03:52:58.0  )
దిల్‌రాజు ఆ రోజు నన్ను దారుణంగా తిట్టాడు : సుకుమార్
X

దిశ, సినిమా: టాలీవుడ్ పాన్ ఇండియా దర్శకులో సుకుమార్ ఒకరు. ప్రస్తుతం ‘పుస్ప2’ మూవీ షూట్ లో బీజిగా ఉన్నసుకుమార్ తాజాగా ఓ ఇంటర్య్వూలో భాగంగా తన కెరీర్‌కి సంబంధించి కొన్ని విషయాలు పంచుకున్నాడు..‘ ‘ఆర్య’ మూవీ హిట్‌తో నాలో తెలియని ఒక యాటిటూడ్ వచ్చేసింది. అలా రెండో సినిమా మహేష్ బాబు లేదా అల్లు అర్జున్ తోనే తీయాలనుకొన్నా. కానీ దానికి నిర్మాత అయిన దిల్ రాజు ఒప్పుకోలేదు. దీంతో ఎవరికీ చెప్పకుండా హీరో రామ్‌కి కథ చెప్పి ‘జగడం’ సినిమా తీయడానికి ఓకే చేసుకుని.. తెల్లవారి షూటింగ్ మొదలు పెట్టా. ఇక విషయం తెలిసిన దిల్ రాజు సెట్ దగ్గరకు వచ్చి ‘బుద్ధుందా నీకు ఎవరైనా ఇలా చేస్తారా కోపం వస్తే చెప్పాలి కానీ.. ఇలా చెప్పా చేయకుండా వెళ్లి సినిమా చేసి ఇస్తావా’ అంటూ తిట్టారు..

అప్పట్లో నా జడ్జిమెంట్ కరెక్ట్ అనే భ్రమలో ఉండే వాడిని ఎవరు ఏం చెప్పినా వినాలనిపించేది కాదు. కానీ ఆయన చెప్పిన మాట వినకుండా సినిమా తీసి ఫ్లాప్ రావడం తో నాలో ఉన్న ఈగో చచ్చిపోయింది. అప్పటి నుంచి ఎవరు ఏం చెప్పినా వినడం అలవాటు చేసుకున్న. నేను ఆ రోజు చేసిన తప్పు కేవలం అమాయకత్వంతో చేసిన తప్పు అని.. ఆ రోజు దిల్ రాజు గ్రహించారు. కాబట్టే ఈరోజు నేను ఇండస్ట్రీలో ఉండగలిగాను’ అని తెలిపారు సుకుమార్.

Advertisement

Next Story