మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్‌కు మధ్య విభేదాలు.. సాక్ష్యం ఇదే అంటున్న నెటిజన్స్

by samatah |   ( Updated:2023-03-28 12:35:03.0  )
మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్‌కు మధ్య విభేదాలు.. సాక్ష్యం ఇదే అంటున్న నెటిజన్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీకి ఈ మధ్య పడటం లేదు. ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు మెగా ఫ్యామిలీకి మధ్య విభేదాలు ఏర్పాడ్డాయంటూ ఈ మధ్య చాలా వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇక వీటిపై అటు, అల్లు అర్జున్ కానీ, అటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్పందిచకపోవడం విశేషం.

అయితే వీటిని మెగా అభిమానులు, అల్లు అభిమానులు కొట్టి వేస్తున్నారు. వారిద్దరి మధ్య ఎలాంటి భేదాలు లేవు అంటూ చెప్పుకొస్తున్నారు. కానీ వీరిద్ధరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని నిన్నటితో క్లారిటీ వచ్చింది అంటున్నారు నెటిజన్లు.

ఎలా అంటే?.. నిన్న రామ్ చరణ్ పుట్టిన రోజు కావడంతో చిరంజీవి, చెర్రీ బర్త్ డేను ఘనంగా జరిపాడు. ఈ వేడుకలకు ఎందరో సినీ ప్రముఖులు హాజరయ్యారు. కానీ అల్లు అర్జున్ మాత్రం హాజరు కాలేదు అంతే కాకుండా,రామ్ చరణ్‌కు కనీసం విష్ కూడా చేయలేదు. దీంతో అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీకి పడటం లేదు, దానికి ఇదే నిదర్శనం అంటూ చెప్పుకొస్తున్నారు నెటిజన్స్.

Read more:

ఆమెతో మరోసారి.. అడ్డంగా బుక్ అయిన నాగచైతన్య

Advertisement

Next Story