నాగార్జున,రాజమౌళి కాంబినేషన్‌లో ఆ బ్లాక్ బస్టర్ మూవీ మిస్సైందా?

by Jakkula Samataha |
నాగార్జున,రాజమౌళి కాంబినేషన్‌లో ఆ బ్లాక్ బస్టర్ మూవీ మిస్సైందా?
X

దిశ, సినిమా : స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఏ సినిమా తీసినా సరే, అది రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటది.బాహుబళి,త్రిబుల్ ఆర్ సినిమాలతో ఈయన రేంజ్ మరింత పెరిగింది. వరల్డ్ వైడ్‌గా ఈయన అంటే స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. ఇక తాజాగా రాజమౌళికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే జక్కన్న గతంలో నాగార్జునతో ఓ సినిమా తెరకెక్కించాలి అనుకున్నాడంట. కానీ కొన్ని కారణాల చేత ఆ సినిమా మరో హీరో చేతిలోకి వెళ్లిపోయిందంట.

ఇంతకీ అది ఏ సినిమా అనుకుంటున్నారా? సునీల్, సలోని జంటగా నటించిన మర్యాదరామన్న.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే మొదట ఈ కథను రాజమౌళి నాగార్జునకు వినిపించాడంట. కానీ నాగార్జున దీన్ని రిజెక్ట్ చేయడంతో ఆ అవకాశం కాస్త సునీల్‌కు వెళ్లింది.

Advertisement

Next Story