ఆ ఐదు సినిమాలను మిక్స్ చేసే దసరా సినిమా తీశారా?

by samatah |   ( Updated:2023-03-31 13:02:27.0  )
ఆ ఐదు సినిమాలను మిక్స్ చేసే దసరా సినిమా తీశారా?
X

దిశ, వెబ్‌డెస్క్ : నాని పాన్ ఇండియా మూవీ దసరా సినిమా థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై పలువురు పలువిధాలుగా స్పందిస్తున్నారు. కొందరు మూవీ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తే మరికొందరు, దసరా మూవీ దర్శకుడు సుకుమార్ సినిమాలపై ఆధారపడి దసరా సినిమాను తీశాడంటూ చెప్పుకొస్తున్నారు.

మొత్తం ఐదు సినిమాలను ఆసరాగా తీసుకొని ఈ దర్శకుడు దసరా సినిమాను తెరకెక్కించాడు, శ్రీకాంత్ ఓదేల చాలా తెలివైనోడు అంటూ ముచ్చటిస్తున్నారు. దసరా మూవీకి ఆర్య2, రంగస్థలం, పుష్ప సినిమాలను స్పూర్తిగా తీసుకున్నారు. ఈ దర్శకునిపై సుకుమార్ ప్రభావం ఎక్కువగానే ఉంది. అలాగే, సినిమాలోని టెంప్లేట్ విషయానికి వస్తే కోలీవుడ్ మూవీ మద్రాస్ ను గుర్తు చేస్తుంది. అంతే కాకుండా మూవీలోని క్లైమాక్స్ సీన్ కు కాంతార సినిమా ఒక విధంగా స్పూర్తి అని చెప్పవచ్చు.కాంతార క్లైమాక్స్ లా ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేయాలని భావించి కథనాన్ని ఆ విధంగా సిద్ధం చేసిన్లు ఉన్నారు, మొత్తాని ఈ ఐదు సినిమాల ఆధారంగా దసరా సినిమా తెరకెక్కించారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Dasara box office collection Day 1: సునామీ సృష్టిస్తున్న‘దసరా’..

Advertisement

Next Story