ప్రియాంక ‘మిస్ వరల్డ్’ అందుకున్నప్పుడు భర్త వయసు ఎంతో తెలుసా?

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-12 06:54:07.0  )
ప్రియాంక ‘మిస్ వరల్డ్’ అందుకున్నప్పుడు భర్త వయసు ఎంతో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌తో పాటు, హాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో స్టార్ డమ్ సంపాదించారు. అయితే తనకంటే పదేళ్లు చిన్న వాడైన నిక్ జొనాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే తాజాగా ప్రియాంక ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నారు. ప్రపంచ సుందరిగా గెలిచినప్పుడు తన వయసు 17 ఏళ్లని, అప్పుడు నిక్ వయసు 7 ఏళ్లు అని తెలిపింది. 2000లో జరిగిన ఆ ఈవెంట్ ను నిక్ వాళ్ల తల్లిదండ్రులు టీవీలో చూశారంట. ఈ విషయాన్ని నిక్ వాళ్ల అమ్మ తనకు చెప్పిందని ప్రియాంక తెలిపింది. ఇంట్లో వాళ్లతో కలిసి నిక్ ఆ ప్రొగ్రామ్ చూశాడని తెలిపింది. అయితే విధి మా ఇద్దర్ని కలిపింది. మేము కలవాలని రాసి పెట్టి ఉంది కాబట్టే వయసుతో సంబంధం లేకుండా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామని ప్రియాంక తెలిపింది.

Also Read. యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (వీడియో)

బెస్ట్ ఫాంట‌సీ ఫిల్మ్‌ అవార్డును సొంతం చేసుకున్న ‘శాకుంత‌లం’.. ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు

ఆ క్యారెక్టర్ నన్ను భావోద్వేగానికి గురిచేసింది.. చాలా ఏడ్చేశా

Advertisement

Next Story