- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పల్లవి ప్రశాంత్ బెయిల్ వెనక సీఎం రేవంత్ రెడ్డి హస్తం?
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్ సీజన్-7లో విన్నర్‌గా బయటికొచ్చినా పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్‌దీప్ కారును ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించారని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను ఇచ్చింది. దీంతో రైతు బిడ్డ ప్రశాంత్ శనివారం జైలు నుంచి విడుదలయ్యారు. పల్లవి ప్రశాంత్ అరెస్టుపై తోటి కంటెస్టెంట్లైన అశ్విని, శివాజీ, ప్రియాంక స్పందించిన విషయం తెలిసిందే. కాగా, ఎప్పుడైతే రైతు బిడ్డ మీద పోలీసులు కేసు నమోదు చేశారో అప్పటి నుంచి భోలే.. ప్రశాంత్‌ను అరెస్ట్ కాకుండా చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఫలితం దక్కకుండాపోయింది.
ప్రశాంత్‌ను జైలుకు తరలించిన తర్వాత భోలే మీడియా ముందుకొచ్చారు. అతడు ఇచ్చిన పిలుపు మేరకే లాయర్లు వచ్చి ఈ కేసును స్వచ్చందంగా వాదించారని, భోలే కారణంగానే ప్రశాంత్ బయటికొచ్చాడంటూ రైతుబిడ్డ ఫ్యాన్స్ అతడిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అయితే భోలే డీసీపీతో చర్చలు జరిపాడట. అయినా ప్రయోజనం లేకపోవడంతో ప్రజావాణి ద్వారా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారని సమాచారం. సీఎం దృష్టికి తీసుకెళ్లాకే బెయిల్ రావడంతో సీఎం, భోలే కృషి ఫలితంగానే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ వచ్చిందని సోషల్ మీడియాలోని టాక్.