టవల్ ఫైట్‌ కోసం కత్రినా కైఫ్‌ ఇంత కష్టపడిందా..? వైరల్ అవుతున్న వీడియో

by Prasanna |   ( Updated:2023-11-11 16:47:34.0  )
టవల్ ఫైట్‌ కోసం  కత్రినా కైఫ్‌ ఇంత కష్టపడిందా..? వైరల్ అవుతున్న వీడియో
X

దిశ,వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ యాక్షన్‌ సీన్లలో నటించడం ఆమెకి కొత్తేమీకాదు. గతంలో పలు సినిమాల్లో ఫైట్‌ సీక్వెన్స్‌లో నటించి అందర్ని మెప్పించింది. యాక్షన్ సన్నివేశాలు చేసేటప్పుడు ఈ ముద్దుగుమ్మ తప్పని సరిగా శిక్షణ తీసుకుంటుందట.

సల్మాన్‌ హీరోగా నటిస్తోన్న టైగర్‌ 3 కోసం కూడా చాలా పడిందట. ముఖ్యంగా ట్రైలర్‌లో వచ్చే కత్రినా కైఫ్ టవల్ ఫైట్ టైగర్‌ 3 పై అంచనాలను అమాంతం పెంచేసింది. అయితే ఈ ఫైట్‌ కోసం తానెంతగానో కష్టపడ్డానంటోంది క్యాట్. దీనికి సంబందించిన వీడియోను తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. హీరోలు ఫైట్స్ బాగా చేస్తుంటారు. అయితే ప్రతిసారీ వారికి మళ్లీ శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అది తెలిసిన విద్య. కానీ హీరోయిన్లకు ఫైట్‌ చేసే అవకాశం చాలా తక్కువ. 'టైగర్ 3' మూవీలో జోయా పాత్ర కోసం కత్రినా కైఫ్ చాలా రోజులుగా కష్టపడింది. దీపావళి కానుకగా నవంబర్ 12న 'టైగర్ 3' విడుదల కానుంది. ముంబైలో ఉదయం 6 గంటలకు షో ప్రారంభం కానుంది. మనీష్‌ శర్మ టైగర్‌ 3 ను తెరకెక్కించారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ కూడా ఇందులో ఓ క్యామియో రోల్‌ పోషించనున్నారని తెలుస్తోంది.

Advertisement

Next Story