Bigg Boss 8: బర్రెలక్క ఎంట్రీని బిగ్ బాస్ అలా ప్లాన్ చేశాడా.. ఇది ఎవరు ఉహించలేదుగా..!

by Prasanna |
Bigg Boss 8: బర్రెలక్క ఎంట్రీని బిగ్ బాస్ అలా ప్లాన్ చేశాడా.. ఇది ఎవరు ఉహించలేదుగా..!
X

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు నుంచి బుల్లి తెర ప్రేక్షకులకు పండగే పండగ.. ఎందుకంటే అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 ఈ రోజు సాయంత్రం గ్రాండుగా లాంచ్ కానుంది. ఈ సారి ఆట ఎలా ఉండబోతుందా అని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. మీ ప్రశ్నలన్నిటికి మరి కొద్దీ గంటల్లో సమాధానాలు దొరుకుతాయి.

అయితే, కంటెస్టెంట్స్‌ లో ఈ సారి 7 గురు అమ్మాయిలు, 7 గురు అబ్బాయిలు హౌస్ లోకి వెళ్తున్నట్టుగా రిలీజ్ ప్రోమోలో తెలుస్తుంది. కానీ, ఈ సీజన్లో సోలో ఎంట్రీ లేదంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చి జంటలుగా ఇంట్లోకి నాగ్ పంపబోతున్నారు. ఇప్పుడు, వీరి సంగతి కాసేపు పక్కన పెడితే బర్రెలక్కకి సంబందించిన ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది.

14 కంటెస్టెంట్స్‌ ఈ రోజు సాయంత్రం ఇంట్లోకి వెళ్ళబోతున్నారు.. అక్కడి వరకు బాగానే ఉంది. ప్రతి సీజన్లో మాదిరిగానే .. ఈ సీజన్లో కూడా వైల్డ్ కార్డు ఉండనుందని తెలుస్తుంది. అయితే, వారిలో బర్రెలక్క మొదటి వైల్డ్ కార్డు ఎంట్రీ అని తెలిసిన సమాచారం. ఇదే నిజమైతే ఈమె లైఫ్ తిరిగిపోయినట్టే.. ఎలెక్షన్స్ సమయంలో ఈ అమ్మాయి ఎన్ని అవమానాలు ఎదుర్కొందో మనందరికి తెలిసిందే. ఈ విధంగా అయినా ఆమె పడిన కష్టాలకు ప్రతి ఫలం దక్కితే బర్రెలక్క ఫ్యాన్స్ సంతోషంగా ఫీల్ అవుతారు.

Advertisement

Next Story

Most Viewed