Raayan Movie: బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా ధనుష్ రాయన్

by Prasanna |
Raayan Movie: బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా ధనుష్ రాయన్
X

దిశ, సినిమా: ధనుష్ డైరెక్టర్ గా, హీరోగా నటించిన కొత్త మూవీ ‘రాయన్’. పూర్తి గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో రూపొందించిన ఈ మూవీ జులై 26న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అన్ని సెంటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఈ సినిమాలో ధనుష్ తో పాటు తెలుగు హీరో సందీప్ కిషన్ కూడా ముఖ్య పాత్రలో నటించాడు. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్స్ ప్రేక్షుకులు బాగా ఆకట్టుకున్నాయి. ఫస్ట్ డే నుంచి మంచి టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్లో వసూలు చేసాయి. రెండు రోజులు కలెక్షన్స్ చూసుకుంటే..

నైజాం - 01.22 CR

సీడెడ్ - 0.21 CR

ఉత్తరాంధ్ర - 0.26 CR

ఈస్ట్+వెస్ట్ - 0.15 CR

కృష్ణా+గుంటూరు - 0.06 CR

నెల్లూరు - 0.15 CR

ఏపి+తెలంగాణ - 0.15 CR

రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ - 0.08 CR

వరల్డ్ వైడ్(టోటల్) - 02.28 CR

రాయన్ సినిమాకి తెలుగులో రూ.02.10 కోట్లు బిజినెస్ జరిగింది. రెండు రోజుల్లో రూ.02.28 కోట్ల షేర్ ని రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వచ్చిన ఈ మూవీ ఇంకా రూ.0.32 కోట్ల షేర్ ను కలెక్ట్ చేస్తే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఈ మూవీ ధనుష్ కెరియర్లో 50 వ మూవీగా వచ్చిన మనకి విషయం తెలిసిందే. ఈ హిట్ తో తెలుగులో తన మార్కెట్ ని పెంచుకోవాలని హీరో ధనుష్ ప్రయత్నాలు చేస్తున్నాడు.

Advertisement

Next Story