Dhanush : ‘విరాట‌ప‌ర్వం’ దర్శకుడితో ధ‌నుష్ మూవీ?

by samatah |   ( Updated:2023-06-15 09:38:21.0  )
Dhanush : ‘విరాట‌ప‌ర్వం’ దర్శకుడితో ధ‌నుష్ మూవీ?
X

దిశ, సినిమా: స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాలో న‌టిస్తున్నాడు. అరుణ్ మాథేశ్వర‌న్ ద‌ర్శక‌త్వంలో వస్తున్న ఈ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌‌లో సందీప్‌కిష‌న్‌, ఎస్‌జే సూర్య కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. లాస్ట్ టైం ‘సార్’ మూవీతో మంచి స‌క్సెస్‌ను అందుకున్న ధనుష్.. ప్రస్తుతం టాలీవుడ్ ద‌ర్శకుల‌పై స్పెష‌ల్ ఫోక‌స్ పెడుతున్నాడు. ఇందులో భాగంగా తాజాగా మ‌రో టాలీవుడ్ డైరెక్టర్‌తో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ‘విరాట‌ప‌ర్వం’ దర్శకుడు వేణు ఊడుగులతో ఓ మూవీ చేయ‌బోతున్నట్లు తెలుస్తోంది. త్వర‌లోనే దీని గురించి క్లారిటీ రానుంది.

Also Read: జీహాద్ కోసం ప్రాణాలు అర్పిస్తే.. స్వర్గంలో కన్యలు సేవ చేస్తారు: వివాదాస్పదమైన ‘72 హూరైన్’

Advertisement

Next Story